ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. సిట్ కీలక విషయాలను సేకరించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు విజయ సాయిరెడ్డి. ఇవాళ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. విచారణకు రావాలని కసిరెడ్డికి నాలుగోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. కసిరెడ్డి విచారణపై కొనసాగుతున్న సస్పెన్స్.. అందుబాటులో ఉండాలని కసిరెడ్డి తండ్రికి సిట్ ఆదేశాలు జారీచేసింది.
Also Read:Minister Narayana: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రకు అందరూ సహకారం అందించాలి..
లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సిట్.. ప్రధానంగా స్కాం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. స్కాంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరున్నారు, ఎవరు అండతో రాజ్ కసిరెడ్డి ఈ వ్యవహారాలు నడిపారనే విషయాలను తెలుసుకోవటంపై సిట్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కాంలో ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయనే విషయాలను కూడా తెలుసుకోవటంపై ప్రధానంగా సిట్ విచారణ జరుగుతోంది.