ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.. లిక్కర్ స్కాంలో సాక్షిగా హాజరుకావాలని విజయసాయిరెడ్డి గతంలో నోటీసులు జారీ చేసింది సిట్.. దీంతో, విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. అయితే, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి.. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారట.. మొత్తం ఆరుగురు సభ్యుల బృందం విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది.. రూ.40 కోట్లు గానీ, 60 కోట్ల రూపాయాలు గానీ.. ఎలా వాడుకున్నారు..? అని ప్రశ్నించగా.. నేను లోన్ మాత్రం ఇప్పించాను.. కానీ, ఆ ఫండ్స్ ఎలా వాడుకున్నారు.. ఎలా రీఫండ్ చేశారు అనేది మాత్రం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలరని చెప్పారు సాయిరెడ్డి..
Read Also: Kamal Haasan : ఆ ఇద్దరూ నాకు ఐలవ్ యూ చెప్పలేదు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..
సిట్ విచారణకు సాక్షిగా రావాలని నన్ను పిలిచారని తెలిపారు విజయసాయిరెడ్డి.. 4 అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారు.. మొదటిగా హైదరాబాద్‌లో జర్నలిస్టు కాలనీలో నా నివాసంలో మీటింగ్ జరిగిందా అని అడిగారు.. విజయవాడ లో వున్న నా నివాసంలో మరో మీటింగ్ జరిగిందా అని అడిగారు.. ఈ మీటింగ్ ల లో ఎవరెవరు హాజరు అయ్యారు అని అడిగారు.. నిజమే మీటింగ్ లు జరిగాయి అని వారికి స్పష్టం చేశాను.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ తో పాటు పలువురు హాజరు అయ్యారు అని చెప్పాను.. ఆ సమావేశం లో లిక్వెర్ పాలసీ గురించి మాట్లాడారు.. సత్య ప్రసాద్, వాసు దేవరెడ్డిలు నేను కిట్ బాగ్స్ గురించి మాట్లాడను అని చెప్పారు అన్నారు.. కిట్ బ్యాగ్స్ రాజ్ కసిరెడ్డి కలెక్ట్ చేసారు ఎవరికి పంపారు అని అడిగారు.. అయితే కిట్ బ్యాగ్ లేనప్పుడు అవి ఎవ్వారికి ఇచ్చారు అని చెప్పగలను అన్నారు సాయిరెడ్డి..
Read Also: 2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
అదాన్, డిస్తలరీస్ కు 60 కోట్లు డీ కార్ట్ కంపెనీ కు 40 కోట్లు ఇప్పించారా అని అడిగారు.. 12 శాతం ఇంట్రెస్ట్ తో ఇప్పించాను.. దీనికి ఉన్నతమైన పదవులు వున్నవారు ఎవ్వరైనా వారికి డబ్బులు ఇప్పించాలి అని చేప్పరా అని అడిగారు.. లేదు నేనే ఇప్పించను అని చెప్పాను అని సమాధానం ఇచ్చినట్టు సాయిరెడ్డి తెలిపారు.. 60 కోట్లు కు 12 శాతం వడ్డీ చెల్లించారు.. 40 కోట్లు అసలు ఇంకా ఇవ్వలేదు డిస్ప్యూట్ లో వుంది అని చెప్పాను.. ఒరిస్సా నుండి లిక్కర్ ను ఒరిస్సా రాష్ట్రం నుండి తెచ్చి డ్యూటీ ఫ్రీ చేసి అమ్మరా అని అడిగారు.. రాజ్ కసి రెడ్డి కొన్ని కంపెనీలను లీజ్ కు తీసుకొని కొత్త బ్రాండ్ ఫ్లోట్ చేశారా? అని అడిగారు.. నా కున్న సమాచారం ప్రకారం ఆయనకు రేపు రమ్మని నోటీసు ఇచ్చారు.. మిథున్ రెడ్డిని మీరే అడగండి అని సూచించారు.. రాజ్ కాసిరెడ్డిని అప్ స్క్యాండ్ అయ్యాడు.. ఆయన్ను తెచ్చి ఆ ప్రశ్నలు అడగండి అని మీడియాకు సూచించారు.
Read Also: Rahul Gandhi: దళితుల విద్యార్థుల కోసం “రోహిత్ వేముల” చట్టం తీసుకురావాలి..
2017-18లో రాజ్ కాసిరెడ్డి పార్టీలోకి వచ్చారు.. అతను తెలివైన క్రిమినల్.. అటువంటి వాడు కాదని నేను అతన్ని ఎంకరేజ్ చేశాను.. ఆయనకు ఎన్ ఆర్ ఐ విభాగం, తరువాత ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు అప్పగించా.. కానీ, రాజ్ కసిరెడ్డి పార్టీని, ప్రజలను మోసం చేశారని తెలిపారు.. పార్టీని, ప్రజలను రాజ్ కాసిరెడ్డీ మోసం చేశాడు అని అందరికి తెలిసిందే అన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..