MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు.
Ramanaidu Studio Lands: విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు.
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణించి 14 రోజులైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు అరి అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రశ్నించారు. ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని చెప్పడంతో మాకు ఏం కాదని ప్రభుత్వం భావిస్తుందా?.. పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే విచారణ చేస్తున్నారు.
3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
Homestay Gang War: తిరుపతిలో హోం స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసి బస్ స్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టే'ల మధ్య ఘర్షణ జరిగింది. 'డెక్కన్ సూట్స్ హోమ్ స్టే' నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది.
Hepatitis Test: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో హెపాటైటిస్ బీ, సీ వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ర్యాండమ్ గా 2, 197 మందికి పరీక్షలు చేయగా.. 205 మందికి పాజిటివ్ వచ్చింది.
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు (ఏప్రిల్ 5న) భద్రాచలం వెళ్ళనున్నారు. రేపు భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్క రోజు ముందుగానే ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు.