TDP vs YSRCP: తణుకులో టీడీపీ వర్సెస్ వైసీపీ..
- తణుకులో టీడీపీ - వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం..
- కారుమూరి నాగేశ్వరరావు వర్సెస్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YSRCP: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని.. అన్ని రకాల రాజకీయాలు చేస్తూ కారుమురికి నూకలు లేకుండా చేస్తామన్నారు. అయితే, ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. నాకు నూకలు చెల్లుతాయని ఎమ్మెల్యే అరిమిల్లి చెప్పడం చూస్తుంటే.. తనని హత్య చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఎంపీటీసీ ఎన్నికల్లో తన ఇంటిని ముట్టడి చేయడం అందులో భాగమన్నారు. రోజుకి నాలుగు గంటలు తన గురించే ఆలోచిస్తూ ఎమ్మెల్యే అరమిల్లి బీపీ పెంచుకుంటున్నారు.. బీపీ పెరిగే చదువుకున్న అజ్ఞానిలా బూతులు తిడుతుంటే.. సంస్కారం అడ్డు వచ్చి ఎమ్మెల్యేని తిట్టలేకపోతున్నాను అన్నారు మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు.
Read Also: Vijayasai Reddy: నంబర్ 2 అనేది మిథ్య.. 6 నెలల్లో 2 నుంచి 2 వేలకు పడిపోయా..! సాయిరెడ్డి సంచలనం..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!