Vijayasai Reddy: వైసీపీలో నేను నంబర్ 2 అనేది మిథ్య.. దయచేసి పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లిపోయారని రాయకండి అని విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్ అడిగిన ప్రశ్నలు.. తాను చెప్పిన సమాధానాలు వెల్లడించారు.. ఇక, ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
Read Also: Pawan Kalyan : ఇదే భారతీయ సంస్కృతి.. యునెస్కో గుర్తింపుపై పవన్
సాయిరెడ్డి ఏ నాటికైనా వెన్నుపోటు పోడుస్తాడు.. అని కోటరీ నన్ను 2 నుండి 2 వేల స్థానానికి పంపించిందన్నారు విజయసాయిరెడ్డి.. ఈ కోటరీ వేధింపులు తాళలేక.. నా నాయకుడు మనసులో లేను అని తెలుసుకొని బయటకు వచ్చాను అన్నారు.. ఇక, జగన్‌కు చెందిన ఛానల్‌లో ఒకతను చెప్పాడు.. ఆ ముసలివాడు వ్యవసాయం అన్నాడు.. రాజకీయం ఎందుకు అని ప్రశ్నించారు.. కొంత మంది నన్ను తిరిగి రాజ్యసభ ఇస్తున్నారు అని ఊహిస్తున్నారు.. బీజేపీ అధ్యక్షుడు, ఇతర రాష్ట్రాలకు పరిశీలకుడు అని ప్రచారం చేయిస్తున్నారు.. నేను రాజకీయాల్లో రీ ఎంట్రీ కావాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు.. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదైనా వుంటే చెప్పుతాను అని స్పష్టం చేశారు.. లిక్కర్ అమ్మకాల్లో స్కాం జరిగిందా లేదా అనేది రాజ్ కసిరెడ్డిని అడగాలని సూచించారు.. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, చాణక్య అలియాస్ ప్రకాష్, కిరణ్ , నూనీట్, సైఫ్ అనే వాళ్లు ఈ నెట్వర్క్ లో వున్నారు అని సిట్‌కు చెప్పాను అన్నారు.. ఇక, నాకు ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా.. అయితే భగవంతుడు డబ్బులిస్తే చేస్తా.. ప్రజలు పొలిటికల్ రీ ఎంట్రీ కోరుకుంటే వస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి..