* నేడు లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి.. ఇప్పటికే సెట్ ముందు హాజరైన విజయసాయిరెడ్డి.. విచారణకు రావాలని కసిరెడ్డికి నాలుగోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు..
* నేడు గుంటూరులో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం.. పాల్గొననున్న సీఎస్ విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్..
* నేడు గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసం.. మలేషియా క్యాంప్ నుంచి తిరిగొచ్చిన 43 మంది కూటమి కార్పొరేటర్లు.. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీసుకు రానున్న కార్పొరేటర్లు..
* నేడు ఏపీలో విభిన్న వాతావరణం.. పలు జిల్లాల్లో ఎండలు.. మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షం కురిసే అవకాశం..
* నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి..
* నేడు ఆన్ లైన్ లో తిరుమల జులై నెల దర్శన టికెట్లు.. ఈ నెల 24 వరకు అందుబాటులో ఉండనున్న టికెట్లు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
* నేడు దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా.. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, ౘపట్టనున్న ఆందోళన..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొట్టనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ తో తలపడనున్న లక్నో సూపర్ జెయింట్స్..