ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన ఏపీ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. చాలామంది యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఈ జాబితాలో కర్నూలుకు చెందిన దిలీప్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కర్నూలు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల కుమారుడు దిలీప్ అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశాడు. అగ్రికల్చర్‌లోనే ఎమ్మెస్సీ చేయాలని నిర్ణయించుకుని ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీకి వెళ్లి అనుకున్నట్లుగానే అక్కడ ఎమ్మెస్సీ…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. తిరుమలలో భక్తుల రద్దీ అన్యూహంగా పెరిగినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా అధికారులును కేటాయించామని తెలిపారు.. ప్రస్తుతం క్యూ లైన్లో చేరుకుంటున్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల పాటు వేచివుండవలసిన పరిస్థితి ఉందన్నారు… క్యూ లైన్లో ఉన్న భక్తులుకు నిరంతరాయంగా ఆహార సౌకర్యాని కల్పిస్తున్నామని.. రేపు రాత్రికి…
పర్యావరణం, పరిశుభ్రతపై ప్రభుత్వం, సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.. అయితే, ప్రజల రద్దీ ఉండే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించకపోవడంపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి.. అయితే, ఓ ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఆ ఆలయానికి ఈవోగా ఉన్న వ్యక్తితో ఫ్యాన్ తుడిపించారు.. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది.. Read Also: RK Roja: జగన్ చరిత్ర తిరగరాస్తున్నారు.. వారి బాక్స్‌లు బద్దలు కావాలి..! పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్రాక్షరామలో శ్రీ మాణిక్యంబ సమేత…
ఏపీ సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్నని విమర్శించే ఆ బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు.. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు.. కానీ, వారందరి చరిత్రను తిరగరాస్తున్న చరిత్రకారుడు వైఎస్ జగన్…
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు మరోసారి గరంగరంగా మారుతున్నాయి.. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా.. పాత శత్రువులు మిత్రులుగా మారుతుండగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డ పై నిప్పులు చెరిగారు.. గన్నవరం ప్రజలకు తెలుసు నేను విలనో, మంచి వాడినో తెలుసన్న ఆయన.. యార్లగడ్డది ఏమైనా మహేష్ బాబు ముఖమా..? అంటూ ఎద్దేవా చేశారు.. యార్లగడ్డ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి.. నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి.. బహిరంగ విమర్శలు, ఆరోపణలతో.. ఓ వైపు బందరు పంచాయతీ నడుస్తుండగా.. మరోవైపు గన్నవరంలో రచ్చగా మారుతున్నాయి.. అంతేకాదు గన్నవరంలో కొత్త ఈక్వేషన్ మొగ్గ తొడుగుతున్నాయి.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్… దుట్టాకి చెందిన కొత్త ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి యార్లగడ్డ హాజరు కావడం చర్చగా మారింది.. స్థానిక…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీబీఐపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ప్రతీ అంశంపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే సాయిరెడ్డి.. ఇవాళ చంద్రబాబు సీబీఐ కామెంట్స్ పై సెటైర్లు వేశారు.. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు..! అని మండిపడ్డ ఆయన.. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు (నారా) నాయుడు బాబు..…
మచిలీపట్నంలో అధికార పార్టీ వైసీపీలో వర్గవిభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పర్యటనను పేర్ని నాని వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ బాలశౌరి వర్గం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పేర్ని నాని వైఖరిపై ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పేర్ని నాని జాగీరా అని ప్రశ్నించారు. మూడేళ్ళ నుంచి సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ బాలశౌరి…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయించింది. 2020 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికైన మొత్తం 200 మందిలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబర్ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు తెలంగాణ వారే ఉండటం విశేషం. తెలంగాణకు కేటాయించిన వారిలో అవినాష్ కుమార్(బీహార్),…
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన టీడీపీ నేతలతో చర్చించారు. తన పర్యటనలే కాకుండా.. పార్టీ పరంగా కూడా వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అయితే ముందుగా రైతు సమస్యలపై ఉద్యమిద్దామని టీడీపీ నేతలు సూచించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భేటీలో నిర్ణయించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో…