balakrishna surprised his fan in kurnool: హీరో నందమూరి బాలకృష్ణలో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. తాజాగా బాలయ్య మరోసారి ఫ్యా్న్స్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలులో గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే గతంలో ఓ అభిమానికి బాలయ్య మాట ఇచ్చారు. ఈసారి కర్నూలులో వస్తే తప్పకుండా కలుస్తానని చెప్పారు. ప్రస్తుతం బాలయ్య కర్నూలులోనే ఉండటంతో ఇచ్చిన మాట తప్పకుండా అభిమానికి స్వయంగా తానే ఫోన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం అభిమానిని పిలిచి పలకరించడమే కాకుండా అతడి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. అభిమాని కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో అదీ బాలయ్య అంటే అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Read Also: Apple Watch: ‘ఆపిల్ వాచ్’ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
ఇంతకీ ఆ అభిమాని పేరు ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్. ఈ మేరకు కుటుంబంతో కలిసి కర్నూలు రావాలని హీరో బాలయ్య అతడికి స్వయంగా ఫోన్ చేశారు. తన దగ్గరకు వచ్చిన అభిమాని కుటుంబంతో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. అనంతరం అభిమాని పిల్లలతో సరదాగా ఆడుకున్నారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తమ అభిమాన హీరో బాలయ్యతో కలిసి కొంతసేపు గడపడం, భోజనం చేయడంతో సజ్జాద్ హుస్సేన్ ఫ్యామిలీ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమలాంటి వారితో కలిసి బాలయ్య కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందని.. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సంఘటనను తమ కుటుంబం జీవితంలో మరిచిపోలేదని.. ఇది తమకు బాలయ్య ఇచ్చిన బెస్ట్ మెమొరీ అని సజ్జాద్ హుస్సేన్ పేర్కొన్నారు.
#NBKfan's about #Balakrishna Garu pic.twitter.com/abLKGAkAEg
— Nagendra (@mavillanagendra) July 25, 2022