స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం కోఆర్డినేట్స్ (34.27 N, 77.60 E)ను పొందుపరిచారు. భారతదేశంలో డస్టర్‌కు ఉన్న అడ్వెంచర్ ఇమేజ్ను గుర్తు చేసేలా ఈ డిజైన్ రూపొందించారు.
ఫీచర్లు:
ఫీచర్ల పరంగా కూడా ఈ SUV ఆకట్టుకుంటుంది. ఇందులో ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్, ‘మై రెనాల్ట్’ యాప్ ద్వారా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.1 అంగుళాల ఓపెన్ R లింక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17 అంగుళాల ఓషన్ అలాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 HP పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 HP పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది.
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
భారత మార్కెట్లో డస్టర్ మంచి రైడ్ క్వాలిటీ, అద్భుతమైన హ్యాండ్లింగ్, వివిధ రకాల రోడ్లపై సులభంగా ప్రయాణించే సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ, డస్టర్‌తో ప్రయాణించిన కస్టమర్ల అనుభవాలకు గుర్తుగా ఈ అడ్వెంచర్ ఎడిషన్ ను తీసుకొచ్చినట్లు రెనాల్ట్ తెలిపింది.
బాస్టిల్ డే సందర్భంగా లాంచ్:
ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (Bastille Day) సందర్భంగా న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథో (Thierry Mathou), రెనాల్ట్ గ్రూప్ ఇండియా సీఈఓ స్టీఫెన్ డెబ్లైజ్ (Stephane Deblaise) హాజరయ్యారు. ఫ్రెంచ్ వారసత్వానికి, భారత మార్కెట్లో డస్టర్‌కు ఉన్న ప్రత్యేక స్థానానికి గుర్తుగా ఈ ఎడిషన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!