Mohan Babu Meets Chandrababu: చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ.. సుదీర్ఘ చర్చలు.. విషయం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్‌బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు మోహన్‌బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది..
అయితే, ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మోహన్‌బాబు.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. కొత్త చర్చ మొదలైంది.. మరోసారి రాజకీయాల్లోకి మోహన్‌బాబు రాబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది… కాగా, టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల వివాదం సమయంలో.. అప్పుడు మంత్రిగా ఉన్న పేర్నినాని తన ఇంటికి వెళ్లిన సమయంలో అధికారం అంటే తనకు ఆసక్తిపోయిందని వ్యాఖ్యానించారు మోహన్‌బాబు.. 1995లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై సేవ చేశాను.. 1998లో బీజేపీకి ఏపీలో మంచి సీట్లు రావడానికి నేనే కారణం.. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశాను.. వారి గెలుపులో నా పాత్ర ఉంది.. నాకు అన్ని పార్టీల్లో పరిచయాలు ఉన్నాయి.. అందరు నేతలు నా ఇంటికి వస్తుంటారు.. పోతుంటారు అని వ్యాఖ్యానించారు.. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబును కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అనే చర్చ మొదలైంది.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
వైఎస్ జగన్ సమీప బంధువు అని చెప్పుకునే మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసినా.. ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, సినిమా టికెట్ల వివాదం విషయంలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్ లాంటి వారిని పిలిచి తనను పిలవక పోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.. మా ఎన్నికల్లో తమ కుమారుడు విజయం సాధించినా.. సినీ పరిశ్రమలు తాము ఒంటరిగా మిగిలిపోయామనే ఆవేదనతో ఆయన ఉన్నారని టాక్.. అయితే, చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీకి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం నడిపినట్టు చర్చ సాగుతోంది.. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు సపోర్ట్ చేస్తే.. బాలయ్య అండ్ గ్యాంగ్ మాత్రం విష్ణుకు అండగా నిలిచింది.. ఆ ఎన్నికల్లో బాలయ్య టీమ్ కృషి వల్లే విష్ణు విజయం సాధించారని చెబుతుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మన మధ్య గ్యాప్ ఎందుకు? అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేద్దాం.. చంద్రబాబును మీరు కలవడం అని బాలయ్య సూచించడంతో.. ఇవాళ్టి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ, మోహన్‌బాబు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సందర్భాలు లేవు.. ఇదే సమయంలో.. తనకంటూ ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్న ఉద్దేశంతోనే మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!