ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar Prices: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్ (Mahindra Thar) ధరలను మరోసారి పెంచింది. జూలై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ వేరియంట్‌ను బట్టి రూ.27,000 నుంచి రూ.37,000 వరకు ధరలు పెరిగాయి. 2026లో ఇది థార్‌కు మూడో ధరల పెంపు. అంతకుముందు జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కంపెనీ ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు కొన్ని వేరియంట్లకే పరిమితం కాకుండా థార్ లోని అన్ని వేరియంట్లపై అమలు చేసింది. ముడి పదార్థాల (కమోడిటీ) ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా తెలిపింది. ఇంజిన్, గేర్‌బాక్స్, డ్రైవ్‌ట్రైన్‌ను బట్టి ధరల పెంపులో తేడా ఉంది.
ఏ వేరియంట్‌పై ఎంత పెరిగింది?
అత్యధికంగా LXT 4WD 2.2 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.37,000 పెరిగింది. LXT 4WD పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.36,000, LXT 4WD 2.2 డీజిల్ మాన్యువల్ ధర రూ.34,000 పెరిగాయి. అలాగే LXT 4WD పెట్రోల్ మాన్యువల్ ధర రూ.33,000, AXT 2WD 1.5 డీజిల్ మాన్యువల్ ధర రూ.32,500 పెరిగింది. LXT 2WD డీజిల్ మాన్యువల్ ధర రూ.29,500, LXT 2WD పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.27,000 మేర పెరిగింది.
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
తాజా ఎక్స్‌షోరూమ్ ధరలు:
వేరియంట్ – ధర (ఎక్స్‌షోరూమ్)
* AXT డీజిల్ 2WD (MT) – రూ.10.32 లక్షలు.
* LXT డీజిల్ 2WD (MT) – రూ.12.99 లక్షలు.
* LXT పెట్రోల్ 2WD (AT) – రూ.14.76 లక్షలు.
* LXT పెట్రోల్ 4WD (MT) – రూ.15.59 లక్షలు.
* LXT డీజిల్ 4WD (MT) – రూ.16.42 లక్షలు.
* LXT పెట్రోల్ 4WD (AT) – రూ.17.22 లక్షలు.
* LXT డీజిల్ 4WD (AT) – రూ.17.99 లక్షలు.
2026లో మహీంద్రా థార్ ధరలు ఇప్పటికే మూడు సార్లు పెరిగాయి. జనవరిలో రూ.20,000, ఏప్రిల్‌లో రూ.43,000, తాజాగా జూలైలో రూ.37,000 వరకు పెంచింది. దీంతో ఏడు నెలల్లో వరుసగా మూడు సార్లు ధరలు పెరిగింది. థార్ కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసే ముందు తమకు కావాల్సిన వేరియంట్‌కు సంబంధించిన తాజా ఆన్-రోడ్ ధరను డీలర్ వద్ద తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. వరుసగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం తీసుకున్న ధర అంచనాలు ఇప్పుడు మారి ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..