ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘పచ్చకుల పార్టీ ‘కౌంట్ డౌన్’ మొదలైంది. 2024 ఎన్నికల మహా పరాజయానికి ముందే చాప్టర్ క్లోజ్. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు కార్యకర్తలను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికిస్తున్నాడు దొంగ బాబు. తుప్పు, పప్పులను తరిమికొట్టి, జెండా మోసినోళ్లంతా ఏకమై టీడీపీని…
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వెంకాయమ్మ కుటుంబంపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ.. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ ‘చలో కంతేరు’ పేరుతో ఆందోళనలు చేపట్టింది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కంతేరు ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు…
ఏపీ సీఎం జగన్పై నటుడు అలీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం నాడు వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో నటుడు అలీ పాల్గొన్నారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు తమ కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ..…
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు…
ఏపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను స్థానికులు వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.…
★ నేడు తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇప్పటికే గోవా, కొంకణ్, కర్ణాటకకు విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ★ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన.. పాడేరు ఏజెన్సీలో పర్యటించనున్న జయశంకర్.. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, కాఫీ ప్లాంటేషన్ల పరిశీలన ★ తిరుమల: ఇవాళ జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు.. ముత్యపు కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ★ నేటి నుంచి…
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 ఏళ్ల బాలుడికి ఫోన్లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈసారి గేమ్లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను…
రాజమండ్రిలోని ప్రకాష్నగర్లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని..…
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల ద్వారా విమర్శల వర్షం కురిపించారు. ‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానళ్ల మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘బూజు లాంటి రాజు.. ఓ పెగ్గు రాజు.. నీ పదవీ నీ విగ్గులాంటిదే..…