Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో గోదాంతో పాటు సమీప భవనాలకు కూడా అంటుకున్నాయి. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలతో మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడికానుంది. ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!