Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో సరికొత్త సంబరాలు మొదలయ్యాయి. మహేశ్ బాబు మేనల్లుడు గుంటురు మాజీ ఎంపీ జయదేవ్ గల్లా రెండవ కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు సౌత్ కొరియాకు చెందిన హ్యేఇన్ కిమ్ తో సిద్ధార్థ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఘట్టమనేని, గల్లా కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో సిద్ధార్థ్, హ్యేఇన్ కిమ్ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సౌత్ కొరియా సంస్కృతికి చెందిన అమ్మాయి ఘట్టమనేని ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుండటంతో అభిమానులు సైతం ఈ క్రేజీ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
ఈ మధురమైన క్షణాలపై మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ స్పందించారు. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ “సిద్ధార్థ్, హ్యేఇన్ కిమ్‌లకు నిశ్చితార్థ శుభాకాంక్షలు. మీ ఇద్దరి భవిష్యత్తు ఎంతో సంతోషంగా, ప్రేమతో సాగిపోవాలని కోరుకుంటున్నాను” అంటూ నమ్రత రాసుకొచ్చారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సిద్ధార్థ్ గల్లా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతి ఘట్టమనేని కృష్ణ కుమార్తె గల్లా రామచంద్రరావుల కుమారుడనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుండటంతో ఘట్టమనేని ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి.
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!