టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీలో జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచే…
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో జరిగిన అలర్లలో గాయపడిన వారిని సోము వీర్రాజు పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున తాము అభ్యంతరాలు తెలుపుతున్నామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు. Devineni Uma: ఆయన్ను సీఐడీ ఎప్పుడు విచారిస్తుంది? అయితే విధి…
సోషల్ మీడియాలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఫేక్ ట్వీట్‌పై తాను సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. సోది రాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. తాను ఫాల్స్ కంప్లైంట్ చేశానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని.. ఫేక్ ట్వీట్‌ను ఆయన తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. జరభద్రం అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారని.. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావిస్తామని.. నాయకుడు మారాడని చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్ధుల లక్ష్యం నెరవేరినట్లేనని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. YSRCP: సీఎం జగన్ సీరియస్.. జీరో పెర్ఫార్మెన్స్తో ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదో తరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులంటే అభిమానం చూపిస్తున్నారని.. వాళ్లను చూస్తే ఆయనకు స్వజాతి పక్షులం అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అంటూ చురకలు అంటించారు. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పదో తరగతి…
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామని తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సీఎం జగన్ అడిగారని.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా ఉందో చర్చించామని వెల్లడించారు. కోటి 40 లక్షల…
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, ఇంఛార్జుల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్లపై చంద్రబాబు సమీక్షించారు. నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల కో-ఆర్డినేటర్లు చినరాజప్ప, గణబాబు, బుద్దా వెంకన్నలతో విడివిడిగా టీడీపీ అధినేత సమీక్ష జరిపారు. రోడ్డెక్కని నేతలు, పని చేయని నాయకుల విషయంలో నివేదికలు ఇవ్వాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. Minister Roja: పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్…
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రసాభాస జరిగింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రజలకు దగ్గరకు వెళ్లిన సమయంలో కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. మహిళలు సమస్యలు చెప్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను నిలదీసిన వాళ్లంతా టీడీపీ సభ్యులేనని వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై బూతుపదజాలం…
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలాజీ జిల్లాలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మంత్రి రోజా వివరించారు. Varla Ramaiah: సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారింది ఓ ఇంటి దగ్గర మంత్రి రోజా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓ అమ్మాయిని…
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని సజ్జల ఆరోపించారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్…