Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- మిడిల్ ఆర్డర్‌పై శుభ్‌మన్ గిల్ ప్రశంసలు
- భారత బౌలర్ల ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడిన గిల్
- 2027 వన్డే ప్రపంచకప్ కోసం కొత్త కాంబినేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Reaction on India Win vs England 1st ODI: ఇంగ్లండ్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా 2-3 వికెట్స్ పడ్డాక అక్షర్ పటేల్ (57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) బాగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారని ప్రశంసించాడు. ఆ సమయంలో మరో వికెట్ పడుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కాంబినేషన్లపై ప్రయోగాలు చేస్తున్నామని గిల్ వెల్లడించాడు.
మిడిల్ ఆర్డర్‌పై ప్రశంసలు:
మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన కెప్టెన్‌గా మాత్రమే కాదు.. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జట్టులో ప్రతి విభాగం బాధ్యత తీసుకుంటే విజయాలు మరింత సులభమవుతాయి. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ విలువైన పరుగులు చేశాడు’ అని తెలిపాడు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
అందుకే బౌలింగ్ ఎంచుకున్నా:
టాస్ గెలిస్తే ఎందుకు బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామో కూడా శుభ్‌మన్ గిల్ వివరించాడు. ‘మా బౌలింగ్ దళంలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్ మాత్రం అనుభవజ్ఞులతో బలంగా ఉంది. అందుకే మొదటి మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసి.. ప్రత్యర్థి 320 పరుగులు చేసినా వాటిని ఛేదించే సామర్థ్యం మా బ్యాటింగ్‌కు ఉందనే నమ్మకంతో ఆ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పాడు.
బౌలింగ్ మ్యాచ్‌ను టర్న్ చేసింది:
భారత బౌలర్ల ప్రదర్శనను గిల్ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘ఆరంభ 6-7 ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. కొత్త బంతి స్వింగ్ అవుతుండటంతో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాం. పవర్‌ప్లే చివర్లో ఇంగ్లండ్ కాస్త ఆధిపత్యం చెలాయించినా.. మిడిల్ ఓవర్లలో మేము అద్భుతంగా పుంజుకుని వరుసగా ఐదు వికెట్లు తీశాం. అదే మ్యాచ్‌లో కీలక మలుపు’ అని పేర్కొన్నాడు.
ప్రపంచకప్ కోసం కొత్త కాంబినేషన్లు:
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో విభిన్న కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని గిల్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఏ కాంబినేషన్ ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద టోర్నీల్లో బలమైన జట్టుతో బరిలోకి దిగేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నాం. ఇంగ్లండ్‌లోని పిచ్‌లు 2027 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణాఫ్రికా పరిస్థితులను పోలి ఉన్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి స్వింగ్ అవుతోంది. బౌన్స్ కూడా ఉంది. తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాంబినేషన్లను పరీక్షించడం ప్రపంచ కప్‌కు ఎంతో ఉపయోగపడుతుంది’ అని చెప్పాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!