ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. అయితే ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బిగింపు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా అందులో సగం…
కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి…
ఏపీలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్రెంటీస్‌షిప్‌తో కూడిన 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్, కళాశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. కొత్త కోర్సులలో బీఏ టూరిజం, హాస్పిటాలిటీ బీబీఏ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ…
★ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు హౌస్ కమిటీ భేటీ.. భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ సమావేశం.. పెగాసస్ వ్యవహారంపై చర్చించనున్న హౌస్ కమిటీ.. ఇవాళ హోంశాఖతో పాటు వివిధ శాఖలతో కమిటీ భేటీ ★ అమరావతి: నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు… నేడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ★ తిరుమల: నేడు ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల..…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కీలకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి తెలిపారు. తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ప్రధాన…
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోసం చేయడంలో చంద్రబాబు,…
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘుపై కేసు…
ఏపీ ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం సలహాదారుడు ఎం.శామ్యూల్ (రిటైర్డ్ ఐఏఎస్), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా మరో ఏడాది పాటు సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా 2019లో జగన్…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…
★ నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ★ నేడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్-2021కు సంబంధించి పంటల బీమా నగదు విడుదల చేయనున్న జగన్ ★ కాకినాడ: నేడు, రేపు రెండు రోజుల పాటు జిల్లాలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పర్యటన.. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడనున్న మురగన్ ★ విశాఖ: నేటితో ముగిసిన సముద్రంలో చేపల వేట నిషేధం..…