Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poha: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల పులిహోర (పోహా) బెస్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నిమ్మరసం పులుపు, తాలింపు సువాసన, వేరుశెనగలు, జీడిపప్పు కరకరలతో ఈ అటుకుల పులిహోర మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* మందపాటి అటుకులు – 4 కప్పులు
* నూనె – 3 టేబుల్ స్పూన్లు
* వేరుశెనగ గింజలు – 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* మినప్పప్పు – 1 టీ స్పూన్
* శెనగపప్పు – 1 టీ స్పూన్
* పచ్చిమిర్చి – 4 (పొడవుగా చీల్చినవి)
* కరివేపాకు – కొద్దిగా
* పసుపు – ½ టీ స్పూన్
* ఉప్పు – తగినంత
* నిమ్మకాయలు – 2 పెద్దవి లేదా 3 చిన్నవి
* కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
* నీరు – అవసరమైనంత
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల మందపాటి అటుకులు వేసుకోవాలి. పల్చటి అటుకులు ఉపయోగిస్తే అవి త్వరగా మెత్తబడి ముద్దలా మారిపోతాయి కాబట్టి.. మందపాటి అటుకులనే తీసుకోవడం మంచిది. ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీరు పోసి చేత్తో ఒకసారి బాగా కలిపి వెంటనే నీటిని పూర్తిగా వంపేయాలి. అటుకులను ఎక్కువసేపు నీటిలో నాననివ్వకూడదు. నీరు వంపిన తర్వాత వాటిని కొద్దిసేపు పొడిగా ఉంచాలి.
తర్వాత ఒక పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో ముందుగా వేరుశెనగ గింజలు, జీడిపప్పు వేసి స్వల్పంగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు ఒక్కో టీ స్పూన్ చొప్పున వేసి బాగా వేగనివ్వాలి. అనంతరం పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అటుకులను పాన్‌లో వేసి తాలింపు మొత్తం బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. తగినంత ఉప్పు వేసి సిమ్ మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు పెద్ద నిమ్మకాయల లేదా మూడు చిన్న నిమ్మకాయల రసాన్ని పిండాలి. నిమ్మరసం వేసిన తర్వాత మరోసారి మెల్లగా కలిపి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. ఈ అటుకుల పులిహోరను వేడివేడిగా కొబ్బరి పచ్చడి, పెరుగు లేదా ఆలూ కూరతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీతో సుమారు నలుగురికి సరిపడా అటుకుల పులిహోర తయారవుతుంది. తక్కువ సమయంలో రుచికరమైన, తేలికైన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!