ఏపీలో టీడీపీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుండటంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి.. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు.. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా?…
తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకం ఈనెల 12 నుంచి 14 వరకు జరగనుంది. వీటికి సంబంధించిన సేవా టికెట్లను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జ్యేష్టాభిషేకం టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయంది. రోజుకు 600 చొప్పున టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి జ్యేష్టాభిషేకం సేవలో పాల్గొనాలని భావించే భక్తులకు ప్రత్యేకంగా టిక్కెట్లను కూడా విక్రయిస్తున్నట్లు టీడీపీ తెలిపింది. TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం.. అయితే శ్రీవారి…
జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు రానున్నాయని నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. మార్చిలోనే ఎన్నికలు జరగబోతుండటంతో జనసైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది వ్యక్తిగత లబ్ధి కోసం కాదని.. ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన పార్టీ పెట్టారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.…
మూడేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఏపీని వల్లకాడు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారని విమర్శించారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. చాలాచోట్ల కొందరు హత్యలకు గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 4 వేల మంది టీడీపీ వారిపై కేసులు…
తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు.…
ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ గురువారం రాత్రి రవాణా శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు, కనిష్టంగా రూ. 5 వేల వరకు రవాణా శాఖ ప్రతిపాదించింది. పెంపు కారణంగా ఏడాది కాలానికి రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 9999…
జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాలతో విద్యార్థుల భవిష్యత్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. టెన్త్‌లో 67.26 శాతం ఉత్తీర్ణతపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 2.70 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు తప్పారని.. బెండపూడిలో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడిన విద్యార్ధిని సైతం పరీక్షల్లో తప్పడం శోచనీయమన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును తల్లిదండ్రులపై నెట్టే ప్రయత్నం చేయడం ఇంకా పెద్ద తప్పు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.…
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును ఇంకా అమలు చేయడం లేదంటూ ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ…
ఏపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఏపీడీసీ వాట్సాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వేదిక అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన…
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్ఎల్బీసీ తెలిపింది. కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం జగన్…