దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ పథకంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. అగ్నిపథ్ పథకాన్ని ఓ దశాదిశ లేని పథకంగా అభివర్ణించారు. ఈ వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తడి తీసుకువస్తామని.. కాంగ్రెస్ పార్టీ యవతకు సపోర్ట్ గా నిలబడుతుందని సోనియాగాంధీ వెల్లడించారు. సోనియా గాంధీ లేఖను మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రిక్రూట్మెెంట్…
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి…
అగ్నిపథ్ స్కీమ్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు మరిన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు. దేశంలో ‘ అగ్నిపథ్ ’పై జరుగుతున్న ఆందోళన గురించి చర్చించారు. అగ్నిపథ్ కింద కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే ఆర్మీలో చేర్చుకోవడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై నిరసనజ్వాలలు దేశవ్యాప్తంగా రగులుతున్నాయి. అయితే నిన్న అగ్రిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సుమారు 2000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించి, దాదాపు 8 రైళ్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లోని ఇతర సామాగ్రిని సైతం చెల్లాచెదురు చేశారు. మొత్తం 20 కోట్ల వరకు అస్తినష్టం వాటిల్లిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ…
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. కేంద్రం ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ ఆశావహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఆర్ఎస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ స్కీమ్ పై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్…
అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ లో హింసాత్మక ఘటనలు తగ్గడం లేదు. శనివారం భారత్ బంద్ కు బీహార్ విద్యార్థులు పిలుపునిచ్చారు. శనివారం కూడా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటలను జరిగాయి. మరోవైపు బీజేపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే .. అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…
కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆందోళనలకు పాల్పడ్డారు. బీహార్ లోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రైళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. శుక్రవారం తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో ఒక యువకుడు మరణించాడు. ఇదిలా ఉంటే…
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే తరహాలో అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ…
అగ్నిపథ్ ఎందుకు మంటలు రేపుతోంది?కేంద్రం ఏమంటోంది? అభ్యర్థుల సమస్యేంటి?అగ్నిపథ్ పథకంతో ఆర్మీకి ప్రయోజనం ఎంత?జీతాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించటానికే ఈ స్కీమ్ తెచ్చారా? కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్‌మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనలు…