మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘అగ్నిపథ్ స్కీమ్’పై స్పందించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న హింసపై విచారం వ్యక్తం చేశారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ స్వాగతం పలుకుతుందన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఒక ట్వీట్‌లో “అగ్నిపథ్ పథకం నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలు చాలా బాధాకరమైనవి. గత సంవత్సరం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా…
Agnipath Scheme Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనికి అనుమతిలేదని, పాల్గొంటే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అల్లర్లు, విధ్వంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని…
Agnipath Notifications: కేంద్ర ప్రభుత్వం సైన్యంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ను తీసుకువచ్చింది. ఓ వైపు ఈ పథకంపై అల్లర్లు జరుగుతున్నప్పటికీ.. సైన్యం మాత్రం ఇది సైన్యానికి, యువకు లబ్ధి చేకూర్చేలా ఉంటుందని వెల్లడించింది. తొలి బ్యాచ్ కింద 45 వేల అగ్నివీరులను సైన్యంలో చేర్చుకోనున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు తొలి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆరునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యం ( ఆర్మీ)లో అగ్నివీరుల నియామకం —————————————————- అగ్నిపథ్ స్కీమ్ కింద…
సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. 1989 నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉందని డిపార్ట్మెంట్ మిలిటరీ ఎఫైర్స్ అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ పూరి వెల్లడించారు. ప్రతీ ఏడాది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 17,600 మంది రిటైర్ అవుతున్నారని ఆయన తెలిపారు. సైన్యంలో యువరక్తాన్ని నింపేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణల్లో కొత్తదనంతో పాటు అనుభవాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.…
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వం సం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వయోపరిమితి సడలింపుతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లపై పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. అల్లర్లపై ఫాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ కోసం రైల్వేస్టేషన్‌కు సభ్యులు చేరుకుని వివరాలను సేకరించారు. అల్లర్లకు గల కారణాలు, పోలీసుల కాల్పులపై నివేదికను సిద్ధం చేయనున్నారు. సికింద్రాబాద్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. అభ్యర్థులు, పోలీసుల కాల్పుల అంశంలో ఫాక్ట్ ఫైండింగ్ నివేదిక సిద్ధం…
ఆర్మీ కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్ ను వ్యతిరేఖిస్తూ చాలా మంది యువత దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఆర్మీ ఆశావహులు ట్రైన్లకు నిప్పు పెడుతున్నారు. కేంద్రం కూడా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలపై కేంద్రం కూడా కొన్ని సడలింపులను ఇస్తోంది. ఇదిలా ఉంటే అగ్నిపథ్ నిరసనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నిరసనల్లో విధ్వంసంపై మాట్లాడుతూ.. ఇప్పుడు ఎంతమంది నిరసనకారుల ఇళ్లను ధ్వం సం చేస్తారని ప్రశ్నించారు. గత నెలలో బీజేపీ మాజీ…
కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్…
నిన్న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెప్పాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఆర్మీ అభ్యర్థి మహేందర్ మేనమామ మాట్లాడుతూ.. 5ఏళ్ల నుంచి మహేందర్ ఆర్మీలో జాబ్ కొట్టాలని తీవ్ర…