Agnipath: సుప్రీం కోర్టుకు చేరిన అగ్నిపథ్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆందోళనలకు పాల్పడ్డారు. బీహార్ లోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రైళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. శుక్రవారం తెలంగాణలో కూడా అల్లర్లు జరిగాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో ఒక యువకుడు మరణించాడు.
ఇదిలా ఉంటే తాజాగా ‘అగ్నిపథ్’ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలను విచారించాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించడానికి రిటైర్డ్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్ దారులు సుప్రీం కోర్టును కోరారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లలో నిఘాను పెంచారు. ఆందోళనకారులు రైల్వేలను టార్గెట్ చేస్తుండటంతో ఏపీలో పాటు తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్త్ పెరిగింది. ఇప్పటికే హర్యానా, బీహర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేయడంతో పాటు బందోబస్త్ ను పెంచారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!