దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా…
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్’ అంటూ చెప్పుకొచ్చారు.…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేపట్టిన నిరసనకాండ తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లడమే కాకుండా.. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు వెల్లడిస్తూ.. ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి 300 మంది ఆందోళనకారులు సాధారణ ప్రయాణికులలా గేట్…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన అందోళన కారులను కొద్ది సేపటికి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన కారులను రైల్వే స్టేషన్ నుంచి పోలీసు వాహనాలలో తరలించారు. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 143, 147, 324, 307, 435,427, 448,…
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత హింసకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం అయ్యారు. రైల్వే ఉన్నత అధికారులతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పూర్తి పోలీస్ బందో బస్తుతో విశాఖ రైల్వే స్టేషన్ కొనసాగుతోంది. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత కి విజ్ఞప్తి చేస్తున్నాం. హింసాత్మిక కార్యక్రమాలు ద్వారా దేన్ని…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే రైల్వే స్టేషన్‌ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి…
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగుల్చుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన కారుల నిరసనతో రణరంగంగా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడికి వేలమంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పాడుకుందా అని…
సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని, 46 వేల మందిని 90 రోజులలో నియామకం, కేవలం రూ.30 వేల జీతం అర్థం లేనిదన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకమని ఆయన మండిపడ్డారు. పదవ తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో…
కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళన వద్దన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రైల్వే అస్తులు విధ్వంసం వెనుక కుట్ర వుందన్నారు. అగ్నిపథ్ పధకం యువతకు చాలా ఉపయోగకరమనే విషయాలు తెలియని యువత అవేశాలకు లోనవుతున్నారు. సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన వారు సంఘ విద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయి. భారత సైన్యంలో చేరాలని కలలు కంటున్న యవతకు అగ్నిపథ్ ఒక సువర్ణావకాశం లాంటిది. సంఘ విద్రోహ శక్తులతో ప్రధాని పై వ్యతిరేక ప్రచారం…