The Indian Air Force has received over 1.83 lakh applications under the Agnipath recruitment scheme within six days of the registration process, an official communication said.
త్రివిధ దళాలలో చేరాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి తొలి మూడు రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ స్కీంకు సంబంధించి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి మూడు రోజుల్లో 59,960 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై 5న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని.. ఆసక్తి ఉన్న వారు జూలై 5లోగా agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు, అప్‌లోడ్ చేసిన కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు.…
సికింద్రాబాద్ రైల్వేష్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు
దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్‌ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్‌ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు,…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి…
పల్నాడు జిల్లా నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ, ఐబీ సోదాలు ముగిసాయి. అకాడమీ లోని కంప్యూటర్ లలో సమాచారాన్ని హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసుల అదుపులోనే ఆవుల సుబ్బారావు వున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వందలమంది విద్యార్థులను పంపినట్టు గుర్తించారు. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది…
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు…
అగ్నిపథ్ సమస్యగా ఎందుకు మారింది?సైన్యంకంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా?జీతాలు, పెన్షన్లు భారమనుకుంటోందా? సైన్యం కేవలం యుద్ధాల కోసమేనా?అగ్నిపథ్ అగ్గిరాజేసింది..ప్రభుత్వం యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని చెప్తోంది.యువత మా ఉద్యోగాలను మాకివ్వాలని నినదిస్తోంది..ఇరుపక్షాల వాదనలు బలంగానే కనిపించినా, కనిపించే అంశాల వెనుక అసలు సంగతేమిటనేది కీలకంగా మారుతోంది. ఏ ఉద్యోగికైనా కొంత పని, దానికి ఆదాయం ఉంటుంది…ఆ పనికి ఉండే డిమాండ్‌ని బట్టి జీతం ఉంటుంది..ఇదే లెక్కలో చూస్తే సైన్యాన్ని కూడా ప్రభుత్వం చూస్తోందా?జనం ప్రాధాన్యత…
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్…