Agnipath: అగ్నిపథ్ పై కేంద్రం కీలక నిర్ణయం.. రక్షణ శాఖలో 10 శాతం కోటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీమ్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు మరిన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు. దేశంలో ‘ అగ్నిపథ్ ’పై జరుగుతున్న ఆందోళన గురించి చర్చించారు. అగ్నిపథ్ కింద కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే ఆర్మీలో చేర్చుకోవడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఆశావహుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో బీహార్, హర్యానా, తెలంగాణ భారీ విధ్వంసకాండ జరిగింది. ఆందోళనలకు తలొగ్గిన కేంద్ర ప్రభత్వం ఇప్పటికే అగ్నిపథ్ తొలిబ్యాచ్ వయో పరిమితిని ఈ రోజు మరో ఐదేళ్లు సడలించింది. శుక్రవారం రెండేళ్లు సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సడలింపుతో 21 ఏళ్లు ఉన్న వయో పరిమితి 28 ఏళ్లకు పెరిగినట్లు అయింది.
ఇదిలా ఉంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ కింద ‘అగ్నివీరులకు’ 10 శాతం కోటాను రిజర్వ్ చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం త్రివిధ దళాల అధిపతులతో సమావేశం అనంతరం ప్రకటించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్, డిఫెన్స్ సివిలియన్ పోస్టుల్లో, మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ఇస్తున్న రిజర్వేషన్లకు అదనంగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
Also Read
ఇప్పటికే అగ్నిపథ్ కింద అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో (సీఏపీఎఫ్)లో, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు కేంద్ర హోమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. దీంతో పాటు అగ్నివీరులకు ఈ బలగాల్లో చేరేందుకు మూడేళ్లు సడలింపును కూడా ఇవ్వననున్నట్లు తెలిపారు. సీఏపీఎఫ్ కింద బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ జీ, ఎస్ఎస్బీ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.
The 10% reservation will be implemented in the Indian Coast Guard and defence civilian posts, and all the 16 Defence Public Sector Undertakings. This reservation would be in addition to existing reservation for ex-servicemen.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) June 18, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు