Calcutta High Court: పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తేలింది. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
గతేడాది ఖుర్దిష్ యువతి 22 ఏళ్ల మహ్స అమిని పోలీస్ కస్టడీలో మరణించింది. హిజాబ్ ధరించలేదనే ఆరోపణలపై అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినిని అరెస్ట్ చేసి, కొట్టారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించారు. ఆమె మరణంతో యావత్ ఇరాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లోని అయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది.
Ayodhya: ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో నాగ సాధువును దారుణంగా గొంతు కోసి చంపారు. అయోద్యలోని హనుమాన్ గర్హి ఆలయ సముదాయంలో ఈ హత్య చోటు చేసుకుంది. గురువారం నాడు 44 ఏళ్ల నాగ సాధువు రామ్ సహరే దాస్ అనే వ్యక్తిని గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం సాయంత్రం మృతుడి శిష్యుడు దుర్బల్ దాస్ ఆశ్రయంలోకి వచ్చి చూడగా రామ్ సహరే దాస్ ప్రాణం పోయి కనిపించాడని పోలీసుల తెలిపారు. మృతుడి గొంతుపై లోతైన గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్థారించారు.
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్‌గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు.
Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు.
Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.
Nokia: టెక్ రంగంలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో మొదలైన ఈ తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు కంపెనీలు దశల వారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.