Nitin Nabin: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు.
Congress: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘‘ఓట్ చోరీ’’కి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ రోజు(ఆదివారం) ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అండమాన్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ..
Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది.
Kerala: కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్(యూడీఎఫ్) అధిక స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, బీజేపీ కూడా తన రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్త ఒకరు తన ‘‘మీసం’’ కోల్పోవాల్సి వచ్చింది.
BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ కబర్ ఖుదేగీ” అనే హింసాత్మక నినాదాలు…
Lionel Messi: లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ నిరాకరిస్తూ, 14 రోజలు పోలీస్ కస్టడీకి పంపించారు. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్రం గందరగోళం తలెత్తింది. స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అయితే, మెస్సీని వీఐపీలు, రాజకీయ నాయకులు చుట్టుముట్టి ఉండటం, ఆయనను చూసే అవకాశం రాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Himanta Sarma: ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ 'GOAT టూర్ 2025' గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.
Israeli Airstrike: అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ భీకర ఉగ్రదాడి చేసింది. 1200 మందిని క్రూరంగా హతమార్చింది. చాలా మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు చేసి, ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన టాప్ లీడర్లు ఇస్మాయిల్ హానియే, యాహ్యా సిన్వార్‌లను హతమార్చింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వెతికి వేటాడి చంపేసింది.
R Sreelekha: కేరళలో కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈసారి తమిళనాడులో ‘‘పొంగల్’’ పండగ వేడుకలు జరుపుకునే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన పర్యటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రైతులతో కలిసి పొంగల్ జరుపుకోనున్నారు. 2026తో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సాంస్కృతిక ఏకీకరణను పెంపొందించే ప్రయత్నంగా చూస్తున్నారు.