Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన బౌలర్!
- టీ20 క్రికెట్లో నయా చరిత్ర
- టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
- ఒకే మ్యాచ్‌లో 8 వికెట్స్ పడగొట్టిన బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూటాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యేషే టీ20 క్రికెట్ చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యేషే అద్భుత ప్రదర్శన చేశాడు. గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో యేషే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి.. టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండటం మరో విశేషం. అంతర్జాతీయ టీ20లు, టీ20 లీగ్‌ల్లోనూ ఇప్పటివరకు ఈ ఫీట్ ఏ బౌలర్ నమోదు చేయలేదు.
22 ఏళ్ల సోనం యేషే తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. యేషే మూడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చి తొలి బంతికే ఫ్యో వైను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో లిన్ ఆంగ్, కె కె లిన్ తూ వికెట్లను కూడా పడగొట్టి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. తన రెండో ఓవర్లో ఖిన్ ఆయేను అవుట్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన యేషే.. చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భూటాన్ తొలుత బ్యాటింగ్ చేసి 127/9 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మయన్మార్.. యేషే దెబ్బకు 45 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read
- Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
- Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
- Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
- Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
ఇప్పటి వరకు పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే 7 వికెట్లు తీశారు. మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇడ్రస్ (చైనాపై 7/8 – 2023), బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ (భూటాన్‌పై 7/19 – 2025) ఈ ఘనత సాధించారు. అలాగే టీ20 క్రికెట్లో మొత్తంగా చూస్తే.. కొలిన్ అకర్మన్, టాస్కిన్ అహ్మద్ మాత్రమే 7 వికెట్లు తీశారు. మహిళల టీ20 క్రికెట్లో ఇండోనేషియాకు చెందిన రోహ్మాలియా 2024లో మంగోలియాపై 7/0 గణాంకాలతో రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు 8 వికెట్లతో సోనం యేషే ఆ రికార్డులన్నింటినీ అధిగమించాడు.
Also Read: AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం చంద్రబాబుకు మంత్రి ప్రశ్న!
2022 జూలైలో మలేషియాపై టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యేషే.. ఆ మ్యాచ్‌లో 3/16 గణాంకాలతో మెరిశాడు. ఇప్పటి వరకు అతడు 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు సాధించి.. భూటాన్ క్రికెట్‌కు కీలక బౌలర్‌గా ఎదిగాడు. సోనం యేషే సాధించిన ఈ అద్భుత ఘనత టీ20 క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ రికార్డు మరో బౌలర్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
తాజావార్తలు
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!