Mahsa Amini: ఇరాన్ యువతి మహ్స అమినికి ఈయూ ప్రతిష్టాత్మక అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahsa Amini: మహ్సా అమిని.. ఈ ఒక్క పేరు యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. మతరాజ్యంగా ఉన్న ఇరాన్ దేశంలో మహిళలు రోడ్డెక్కి పోరాడారు. హిజాబ్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా యురోపియన్ యూనియన్(ఈయూ)కి సంబంధించిన ప్రతిష్టాత్మక మానవహక్కుల బహుమతిని ‘సఖరోవ్’ ప్రైజ్‌ని ప్రధానం చేసింది. సోవియట్ అసమ్మతివాది ఆండ్రీ సఖారోవ్ పేరు మీద ఈయూ ఈ అవార్డును 1988లో మానవహక్కులు, స్వేచ్ఛను రక్షించే వ్యక్తలుకు అందిస్తోంది.
గతేడాది ఖుర్దిష్ యువతి 22 ఏళ్ల మహ్స అమిని పోలీస్ కస్టడీలో మరణించింది. హిజాబ్ ధరించలేదనే ఆరోపణలపై అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినిని అరెస్ట్ చేసి, కొట్టారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించారు. ఆమె మరణంతో యావత్ ఇరాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లోని అయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
Read Also: Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?
అక్కడి యువత, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. మహిళలు జట్టు కత్తరించుకుని, హిజాబ్ విసిరేస్తూ ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇటు ప్రభుత్వ భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలు మరణించారు. అయితే ఈ నిరసనలను అక్కడి మతఛాందసవాద ప్రభుత్వం అణిచివేసింది. ఈ అల్లర్లకు పాల్పడిన కొంతమంది వ్యక్తుల్ని ఉరితీసింది. ఇటీవల అమిని మృతికి వ్యతిరేకంగా పోరాడిన కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!