Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.
Read Also: Viral Video : దేవుడా.. ఏందీ సామి ఈ అమ్మాయిలు.. నడి రోడ్డు పైనే ఆ పని..వీడియో చూస్తే షాకే..
దీని కారణంగా కంపెనీ షేర్స్ గురువారం 2.5 శాతం వరకు పడిపోయాయి. మధ్యాహ్నం 12.06 గంటల వరకు 1.7 శాతం తగ్గి 525 రూపాయాల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో తన ఇయర్ టూ డేట్ క్షీణతను 6.5 శాతానికి పొడగించింది. ప్రస్తుతం కేసులు తొలిదశల్లో ఉన్నాయని, ఈ ఆరోపణలు నిరాధారణమై, అసంపూర్ణ అధ్యయనం ఆధారంగా ఉన్నాయని పేర్కొంది.
డాబర్ కంపెనీకి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్సీ, డాబార్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్లు డాబర్ ఇండియా ప్రకటనలో తెలియజేసింది. డాబార్ ఉత్పత్తులు పలు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. డాబర్ హెయిర్ రిలాక్సర్లు, హెయిర్ స్ట్రయిటనర్లను ఎలాంటి వైద్యుల సిఫారసు లేకుండా ఓవర్ ద కౌంటర్ గా విక్రమిస్తోందని ఆరోపిస్తున్నారు. మల్టీ డిస్ట్రిక్ లిటిగేషన్ కింద 5400 కేసులు నమోదయ్యాయి.