MIT Dropout to Billionaire: చదువు మధ్యలో ఆపేసి (Dropout) వ్యాపార ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌ల సరసన ఇప్పుడు మరో పేరు చేరింది. అదే సెలిన్ కొకలర్. ఎంఐటీలో చదువును మధ్యలోనే వదిలేసిన ఈ యువతి, తన మిత్రుడు కరుణ్ కౌశిక్‌తో కలిసి ప్రారంభించిన ‘డెల్వ్’ (Delve) అనే ఏఐ (AI) స్టార్టప్‌ను కేవలం రెండేళ్లలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.
విజయానికి కేవలం కష్టపడి పనిచేయడం (Hard Work) మాత్రమే సరిపోదని సెలిన్ అంటారు. “జీవితం వందల చెట్లు ఉన్న తోట లాంటిది. మీరు ఒక చెట్టుకు నిచ్చెన వేసి ఎంతో కష్టపడి పైకి వెళ్లొచ్చు. కానీ పైకి వెళ్లాక పక్కన అంతకంటే ఎత్తైన చెట్టు ఉందని తెలిస్తే మీ కష్టమంతా వృథా అయినట్లే. అందుకే మీరు నిచ్చెన వేస్తున్న చెట్టు (మీరు ఎంచుకున్న మార్గం) సరైనదా? కాదా? అనేది ముందే చూసుకోవాలి” అని ఆమె వివరించారు.
ఒక ‘టైమ్ ట్రావెలర్’లా ఆలోచించాలని ఆమె సూచిస్తున్నారు. “మిమ్మల్ని మీరు 10 లేదా 50 ఏళ్ల భవిష్యత్తులో ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఇప్పటికే విజేతగా మారారు అనుకోండి. అప్పుడు అక్కడ నుండి వెనక్కి తిరిగి చూస్తే.. మీరు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందనిపిస్తుందో అదే చేయండి” అని ఆమె తెలిపారు. దీనివల్ల లక్ష్యాలపై స్పష్టత వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Srisailam Room Booking Scam: శ్రీశైలం భక్తులకు అలెర్ట్.. వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్ల దందా..!
అందరూ చేసే పనే కాకుండా, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని సెలిన్ చెబుతారు. ఉదాహరణకు, అందరూ స్పానిష్ నేర్చుకుంటుంటే ఆమె సవాల్‌గా తీసుకుని చైనీస్ నేర్చుకున్నారట. ఏదైనా శూన్యం నుండి నేర్చుకోవడం వల్ల మనలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందని ఆమె నమ్ముతారు.
సెలిన్ కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, అంతకంటే ముందే ఆమె ఒక మేధావిగా గుర్తింపు పొందారు. ఆమె స్థాపించిన ‘డెల్వ్’ సంస్థ ఏఐ ఏజెంట్లను ఉపయోగించి కంపెనీల ‘రెగ్యులేటరీ కాంప్లయెన్స్’ (నిబంధనల అమలు) ప్రక్రియను సులభతరం చేస్తుంది. 20 ఏళ్ల వయసు వచ్చేసరికే ఆమె 8 పరిశోధనా పత్రాలను (Publications) సమర్పించారు.
హైస్కూల్ చదువుతున్నప్పుడే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రయోగాలు చేసిన అనుభవం ఆమెకుంది. “సరైన దిశలో ప్రయాణించడం” అనేది కష్టపడటం కంటే ముఖ్యమని సెలిన్ కొకలర్ నిరూపించారు. కేవలం డిగ్రీల కంటే ఆలోచనలు, ఆచరణలే మనిషిని గొప్పగా మారుస్తాయని ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తోంది.
IBomma Ravi : రవి కేసులో బిగ్ ట్విస్ట్: విదేశాల ముచ్చట అబద్ధం..షాకింగ్ విషయం వెలుగులోకి