India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదాన్ని రాజేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడం, సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా వదిలివెళ్లమని ఆదేశించడంతో భారత్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా చిక్కుల్లో పడ్డారు. ‘ప్రశ్నకు డబ్బు’ కేసులో ఇరుక్కుపోయింది. అదానీ గ్రూపును, ప్రధాని నరేంద్రమోడీని అభాసుపాలు చేసేందుకు డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలు చేశారు. దీనికి బలం చేకూరుస్తే.
Mahua Moitra: పార్లమెంట్ లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని, ఇందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, ఖరీదైన గిప్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో మొదలైన కెనడా, ఇండియా వివాదం ఇంకా ముగియడం లేదు. తాజాగా మరోసారి కెనడా, భారత్‌ని కవ్విస్తూ ఆ దేశ ప్రజలకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, భారత్ నుంచి తన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలో కెనడా విదేశాంగ శాఖ ఈ సూచనలను చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు ఉన్నందున భారత్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కెనడా ఆ దేశ పౌరులనున హెచ్చరించింది.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి తెగబడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశంచి చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా అత్యంత పాశవికంగా హత్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్నారుల తలలను నరికేశారు. ఈ దాడుల్లో 1400 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
Imran Khan: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూదులకు సన్నిహితుడు కావడం వల్లే ఇమ్రాన్ ఖాన్‌పై ఇస్లామిక్ తీవ్రవాదులు హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోయారు. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 4000 మంది ప్రజలు చనిపోయారు.
PM Modi: పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడితో యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు.
Google Layoff: గత ఏడాది కాలంగా టెక్ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గత నవంబర్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. కొన్ని సంస్థలైతే దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు పనిచేశారనే కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తీసిపారేశాయి.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా బయట అడుగుపెట్టాడు. ఇటీవల కిర్గిజ్స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన పుతిన్ అటునుంచి అటుగా చైనా పర్యటనకు వెళ్లాడు. చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)" ప్రాజెక్టు ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, పుతిన్ కి సాదరస్వాగతం పలికారు.