Nokia: టెక్ రంగంలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో మొదలైన ఈ తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు కంపెనీలు దశల వారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా తాజాగా లేఆఫ్ప్ జాబితాలో చేరింది. మూడో త్రైమాసికంలో 19 శాతం విక్రయాలు తగ్గడంతో నోకియా తన ఉద్యోగులలో 14,000 మందిని తీసేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నోకియాకు ప్రపంచవ్యాప్తంగా 86,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని 72,000 నుంచి 77,000 వరకు సర్దుబాటు చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా వంటి మార్కెట్లలో 5G పరికరాల నిదానమైన అమ్మకాల కారణంగా సేల్స్ చాలా వరకు క్షీణించాయి.
Read Also: Kishan Reddy: రామప్ప అభివృద్ధి చేసింది మేమే.. రాహుల్, ప్రియాంక.. మోడీకి థ్యాంక్స్ చెప్పాలి..
మొబైల్ నెట్‌వర్క్ నికర అమ్మకాలు 19 శాతం క్షీణించాయి. ఎందుకంటే భారతదేశంలో 5 జీ విస్తరణలో కొంత నియంత్రణను చూశామని, ఉత్తర అమెరికాలో మందగమనాన్ని అధిగమించేందుకు ఇక్కడి వృద్ధి సరిపోదని సీఈఓ పెక్కా లండ్‌మార్క్ ఒక ప్రకటనలో తెలిపారు.
నోకియా కొత్త కాస్ట్-సేవింగ్ ప్రణాళిక ద్వారా 2026 నాటికి 800 మిలియన్ యూరోలు, 1.2 బిలియన్ యూరోల మధ్య ఖర్చు తగ్గింపులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026 నాటికి 14 శాతం ఆపరేటింగ్ మార్జిన్ సాధించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ఉంది. మూడవ త్రైమాసికంలో నికర అమ్మాకల్లో అనిశ్చితి కొనసాగినప్పటికీ, నాలుగో త్రైమాసికంతో సాధారణ మెరుగుదలను ఆశిస్తున్నట్లు సీఈఓ తెలిపారు.
2024 నాటికి కనీసం 400 మిలియన్ యూరోల పొదుపు, 2025లో అదనంగా 300 మిలియన్ యూరోల పొదుపును నోకియా అంచనా వేస్తోంది. నోకియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై పెట్టుబడులు పెడుతూ.. వ్యూహాత్మక పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందించే కార్పొరేట్ సెంటర్ గా మారేందుకు సిద్ధంగా ఉంది.