Venu Goapl Reddy
Author- NTV Telugu-
Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
Ecuador: ఈక్వెడార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర ప్రావిన్సుల్లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించారు.… -
Loan app Harassment: లోన్ యాప్ వేధింపులకు ఐటీ ఉద్యోగి బలి.. రుణం చెల్లించినా ఆగని వేధింపులు
Loan app Harassment.. IT employee forced to die: లోన్ యాప్ ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రుణం చెల్లించానా.. ప్రజలను జలగల్లా పట్టి పీల్చిపిప్పి చేస్తున్నారు. లోన్ యాప్ ఆగడాల వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది బాధితులు తనువుచాలించారు. లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే వేధింపులు, అసభ్యకరమైన మాటలు తట్టుకోలేక చాలా మంది లోలోపల కుమిలిపోతున్నారు. చాలా మంది ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా చెన్నైకు చెందిన ఐటీ ఉద్యోగి లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
Donald Trump: సీఎన్ఎన్పై ట్రంప్ పరువు నష్టం దావా.. అలా పిలిచినందుకే..
Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
Amit Shah: జమ్మూకాశ్మీర్ పర్యటనలో అమిత్ షా.. జమ్మూ, రాజౌరిలో నిలిచిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు
Home Minister Amit Shah's visit to Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా తొలిసారిగా శ్రీ మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఝి చాట్ హెలిప్యాడ్ నుంచి కట్రా చేరుకున్నారు అమిత్ షా. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితెంద్ర సింగ్ ఉన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణోమాత ఆలయానికి రావడం… -
Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోొవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది. -
Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
Dubai's new Hindu temple set to open ahead of Dussehra: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో హిందూ ఆలయం ప్రారంభం కానుంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు మంగళవారం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరిగిన ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్ ఆలయానికి పొడగింపు. సింధీ గురుదర్బార్ యూఏఈలోని… -
USA: నలుగురు భారత సంతతి వ్యక్తుల కిడ్నాప్.. బాధితుల్లో 8 నెలల పాప
4 Indian-Origin People Kidnapped In US: అమెరికాలో 8 ఏళ్ల పాపతో పాటు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు దుండగులు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ అయిన వారిలో ఎనిమిది నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ తో పాటు వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. -
Uttar Pradesh: నగ్నంగా బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి చంపినట్లు అనుమానం
Another girl was killed in Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరో బాలికను హత్య చేశారు. ఔరయ్యా జిల్లా దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారు పోలీసులు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మరణంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు మృతదేహంతో పారిపోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది.… -
Gujarat: వడోదరాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు.. 40 మంది అరెస్ట్
40 Arrested After Communal Clash In Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సోమవారం వడోదరాలోని సావ్లి పట్టణంలోని ఓ కూరగాయాల మార్కెట్ వద్ద ఇరువర్గాలు మధ్య అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో వడోదల పోలీసులు మొత్తం 40 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం సావ్లి పట్టణంలో ఓ వర్గం వారు మత జెండాలను ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టారు. దగ్లర్లో ఓ దేవాలయం ఉంది. దీంతో మరో వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
-
PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!