Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్‌ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
Read Also: Dabur India: డాబర్ ఉత్పత్తులపై యూఎస్, కెనడాల్లో కేసులు.. క్యాన్సర్‌కి కారణమవుతున్నాయని ఆరోపణలు..
ఇదిలా ఉంటే ఈ హత్యలో ప్రధాన నిందితుడు గౌస్ మహ్మద్ అనారోగ్యాని గురయ్యాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉంటే అజ్మీర్ జైలులో ఉంచారు.
కన్హయ్యలాల్ ను హత్య చేసిన తర్వాత దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఇద్దరు నిందితులు కత్తులతో ఫోజులు ఇస్తూ, తామే అరెస్ట్ చేసినట్లు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి అప్పగించారు. 2022 డిసెంబర్ లో ఇద్దరు నిందితులతో పాటు మరో 9 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. హత్య, ఉగ్రవాదం, ఇతర అభియోగాల కింద కేసు విచారణ జరుగుతోంది.