Tata Motors: కార్ల సేఫ్టీ విషయానికి వస్తే టక్కున గుర్తు వచ్చే పేరు టాటా. అంతలా ఈ కార్లు సేఫ్టీ రేటింగ్స్ విషయంలో అత్యుత్తమ స్కోర్ సాధిస్తున్నాయి. దేశీయ దిగ్గజ కార్ మేకర్ అయిన టాటా తన కార్ల సేఫ్టీలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. చిన్న కార్ల నుంచి ఎస్యూవీ వరకు అదే ప్రమాణాలను పాటిస్తోంది.
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.
Sumo Wrestlers: సాధారణంగా విమానాలు తన సామర్థ్యానికి సరిపడే బరువుతో మాత్రమే ఎగరగలవు. ఒక వేళ బరువు ఎక్కువైతే టేకాఫ్ సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో బరువు కారణంగా విమానాలు కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. బరువు ఎక్కువైతే ప్రయాణికుల లగేజీని తగ్గించడమో, లేకపోతే వేరే సర్దుబాట్లు చేయటమో జరుగుతుంది.
Russia: ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణుపరీక్షలపై రష్యా చట్టపరమైన వైఖరిని మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గతంలో పుతిన్ తన అభిప్రాయాన్ని చెప్పిన విధంగానే ‘‘అణు పరీక్ష నిషేధ ఒప్పందం’ రద్దు చేసేందుకు రష్యా పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై జరిగిన దాడుల్లో 1400 మంది చనిపోయారు. పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. 200 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇది ఉంటే ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై భీకరదాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు.
Pakistan: ఎప్పుడూ లేనంతగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ పెట్టే అన్ని షరతులకు తలొగ్గుతోంది. దీంతో ప్రజలపై పన్నులను పెంచింది, ఇది తీవ్ర నిరసనకు దారి తీస్తోంది.
Benjamin Netanyahu:ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ సందర్శించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపేందుకే, అమెరికా ఇజ్రాయిల్‌కి వెన్నుదన్నుగా నిలిచేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా దారుణంగా ఉన్నారని బైడెన్ అన్నారు.
Israel: గాజాలో అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 500 మంది మరణించడంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కొత్త టర్న్ తీసుకుంది. ఈ దాడికి మీరంటే మీరే కారణమని ఇజ్రాయిల్, హమాస్ ఒకరినొకరిని నిందించుకుంటున్నాయి.
ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Hate Crime: అగ్రరాజ్యం అమెరికాలో విద్వేషపూరిత దాడులు కొనాసాగుతున్నాయి. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. తాజాగా ఓ సిక్కు యువకుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తలపాగా ధరించిన 19 ఏళ్ల సిక్కు యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది.