France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని ఓ అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు.
Putin: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ రష్యా వెలుపల ఇతర దేశాల పర్యటనలకు వెళ్తున్నాడు. ఇటీవల కిర్గిజ్స్తాన్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చైనా ఘనస్వాగతం పలికింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో దారుణ సంఘటన జరిగింది. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని మోదీతో పాటు యూఎన్ ఈ దాడిని ఖండించాయి. ఈ దాడి జరిపిన వారే దీనికి బాధ్యత వహించాలని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆ దేశానికి వచ్చారు.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరువైపు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేయడంతో 1400 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై జరిపిన వైమానికదాడుల్లో 3000 మంది మరణించారు. మంగళవారం గాజాలోని అల్ అహ్లీ హస్పిటర్ పై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. అయితే ఈ దాడికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. గాజా […]
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 199 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, హమాస్ ని పూర్తిగా అతుముట్టించేలా గాజా స్ట్రిప్‌పై భీకరదాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం గాజాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది మరణించారు.
Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ.
కిమ్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర కొరియాలో జరిగింది. తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేశారు.
LinkedIn: ప్రముఖ బిజినెస్-ఎంప్లాయ్మెంట్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న లింక్డ్ఇన్ మరోసారి తన ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. గతంలో ఇలాగే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన లింక్డ్ఇన్ రెండో రౌండ్లో ఉద్యోగులను తొలగించింది. ఇంజనీరింగ్, టాలెంట్, ఫైనాన్స్ టీముల్లోని 668 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్ నియామకం మందగించడం ప్రస్తుత ఉద్యోగ కోతలకు కారణమవుతోంది.
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
Motion Sickness: కొందరు ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు. వీరు వాహనాల్లోకి ఎక్కిన వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభమవుతోంది. దీన్ని ‘మోషన్ సిక్నెస్’గా పిలుస్తుంటారు. మైకం, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటివి దీనికి లక్షణాలు. అయితే ప్రయాణించేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో మంచి నివారణలు ఉన్నాయి. వంటింటి చిట్కాలను వాడి ఈ మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్‌నెస్‌ని దరికి రానీవ్వకుండా చేయొచ్చు.