Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 2026లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, లాంచ్ తర్వాత దాదాపు నెలరోజులకు మాత్రమే ఈ ఫోన్లు అమ్మకాలకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
కొరియన్ మీడియా సంస్థ ‘ది బెల్’ వెల్లడించిన వివరాల ప్రకారం, సామ్‌సంగ్‌లోని Mobile Experience (MX) డివిజన్ తయారీ ఖర్చులను నియంత్రించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా DRAM, మెమరీ చిప్స్ వంటి కీలక భాగాల ధరలు భారీగా పెరగడం, అలాగే మార్కెట్లో తీవ్రమైన పోటీ కారణంగా మార్కెటింగ్, లేబర్ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో రాబోయే ఫోన్లకు “అసలైన ధరలు” నిర్ణయించడం కష్టంగా మారిందని నివేదిక చెబుతోంది.
Lenin: అఖిల్ ‘లెనిన్’.. అవుట్‌పుట్ పై నిర్మాత కాన్ఫిడెంట్ కామెంట్స్
ఈ పరిస్థితుల నేపథ్యంలో Galaxy S26 సిరీస్ ధరలు, Galaxy S25 సిరీస్‌తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరో కొరియన్ నివేదిక కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో లాభాల మార్జిన్స్‌ను కాపాడుకోవడం కోసమే శాంసంగ్ ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మెమరీ భాగాల కొరత కొనసాగుతున్నందున, తయారీ వ్యయం తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!