Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. గాజా ప్రాంతాన్ని దిగ్భంధించి హమాస్ ఉగ్రవాద స్థావరాలపై నేలమట్టం చేస్తోంది.
Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
El Nino: ఎల్ నినో వాతావరణ పరిస్థితి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వెచ్చటి సముద్ర ఉష్ణోగ్రత ఆధారంగా ఎల్ నినో తీవ్రతను వర్గీకరిస్తారు. తాజాగా ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2024 మధ్య వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి లాటిన్ అమెరికా అంతటా అసాధారణ వర్షపాతానికి దారి తీస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా, రద్దీగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.
Amazon: కోవిడ్ మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) సదుపాయాన్ని కల్పించాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. అయితే కరోనా ప్రభావం తగ్గి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తేస్తున్నాయి.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై భీకరదాడులు చేశారు. అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా దారుణంగా మారణహోమానికి పాల్పడ్డారు. చిన్న పిల్లల్ని కనికరం లేకుండా తలలు నరికి హత్యలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది మరణించారు.
Scammers: దొంగతనాల రూటే మారింది. గతంలో మాదిరిగా ఇళ్లలో నగలు, డబ్బును ఎత్తుకెళ్లడం తగ్గింది. దీని స్థానంలో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండా మన బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ రిపోర్టు ప్రకారం ఏడాది కాలంలో 1.02 ట్రిలియన్ డాలర్ల సొమ్మును కొల్లగొట్టినట్లు తెలిపింది. ఈ అధ్యయనం 43 దేశాలకు చెందిన 49,459 మందిని సర్వే చేసింది. వారు ఎలాంటి మోసాల బారిన పడ్డారు, ఎంత డబ్బు కోల్పోయారనే వివరాలను అడిగింది.
China: చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్ తో మరింతగా సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) కోసం బిలియన్ల కొద్దీ డబ్బును ఖర్చు పెడుతోంది చైనా. ఇక ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ని కౌంటర్ చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ తో తన సంబంధాలు బలంగా ఉండాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని చైనీయులు ఇటీవల కాలంలో దాడుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా […]
Italy PM Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన భాగస్వామి, టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోయినట్లు శుక్రవారం ప్రకటించారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆండ్రియా జియాంబ్రూనోతో కొనసాగిని నా సంబంధం ముగిసిందని మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు. తమ మార్గాలు ప్రస్తుతం వేరయ్యాయని, దానిని అంగీకరించే సమయం వచ్చిందని ఆమె పోస్టులో పేర్కొన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది.