నవతరం తెలుగు సినిమా రచయితల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు బి.వి.యస్. రవి. కొందరు అతణ్ణి ‘మచ్చ’ రవిగానూ పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా పలికే ఈ రచయిత మాటలు కోటలు దాటేలా ఉంటాయి, నిర్మాతల మూటలు నింపేలానూ సాగుతుంటాయి. రవి రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నందమూరి బాలకృష్ణ కోసం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షో కోసం అతను పలికించిన మాటలు ఓ ఎత్తు అని చెప్పవచ్చు. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగిన రవి […]
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు దీనిని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్చన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ళుగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం చెబుతూ, ”నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి […]
2017లో విడుదలైన ‘వానవిల్లు’ సినిమాలో హీరోగా నటించాడు ప్రతీక్ ప్రేమ్ కరణ్. మళ్ళీ ఇంతకాలానికి అతను ‘సదా నన్ను నడిపే’ మూవీలో కథానాయకుడిగా నటించాడు. విశేషం ఏమంటే ఈ మూవీలోని కీలక బాధ్యతలను ప్రతీక్ తన భుజాలకు ఎత్తుకున్నాడు. హీరో నటించడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం వంటి బాధ్యతలను ప్రతీక్ ప్రేమ్ కరణ్ నిర్వహించడం విశేషం. వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డి.ఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట ప్రధాన తారాగణంగా […]
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ మూవీని డా. సోమేశ్వర రావు పొన్నాన , బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇదే నెల 24న 186 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, ”మహాభారతం […]
దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. తేజ – అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత […]
‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ.. అదే ఊపులో అభిమానులకు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట రామ్-లక్ష్మణ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది […]
ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా […]
దర్శక ధీరుడు రాజమౌళి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు జక్కన్న. రెజీనా, నివేదిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జూలై […]
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటీనటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు రాజీ పడటం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు […]
సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది. […]