దర్శక ధీరుడు రాజమౌళి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు జక్కన్న. రెజీనా, నివేదిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జూలై 1న రిలీజ్ కానుంది. ఆహా ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని ఆర్కా మీడియా సంస్థ, ఆహా కలిసి నిర్మించాయి. దాంతో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తన చేతు మీదుగా లాంచ్ చేశారు రాజమౌళి. ఇక ఈ సిరీస్ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సందర్భంగా రాజమౌళి హారర్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
తనకు హారర్ సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు రాజమౌళి. కానీ ఓ రెండు హారర్ సినిమాలు మాత్రం తాను ఇష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి The Omen కాగా రెండోది The Paranormal Activity అని తెలిపాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమాలంటే ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. వాళ్ల జాబితాలో రాజమౌళి కూడా ఉండడం విశేషమనే చెప్పాలి. ఇక కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ, కమర్షియల్, పీరియాడికల్ సినిమాలే చేస్తూ వస్తున్నారు జక్కన్న. ఇక ఇప్పుడు మహేష్‌తో కూడా అలాంటి సినిమానే చేయబోతున్నారు. అయితే ఈ సారి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ మూవీతో రాబోతున్నారు. అయితే బాహుబలి సిరీస్, ట్రిపుల్ ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు దక్కించుకోవడంతో.. జక్నన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టార్స్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి మహేష్ బాబుతో కలిసి.. రాజమౌళి ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.