సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘మాయోన్’ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’. గాడ్ వెర్సస్ సైన్స్ థీమ్ తో రూపొందిన ఈ మిస్టరీ […]
కరోనా తర్వాత ఓటీటీ పుంజుకోవడంతో నటీనటులందరూ పుల్ బిజీ అయ్యారు. వారిలో హీరో త్రిగుణ్ ఒకరు. త్రిగుణ్ నటించిన కొండా మురళి, కొండా సురేఖ బయోపిక్ ‘కొండా’ 23న విడుదల కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి విలేకరులకు తెలియచేశాడు త్రిగుణ్. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ‘కొండా’ సినిమాలో సురేఖగా ఇర్రామోర్ నటించింది. ఈ సందర్భంగా […]
హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు. […]
కన్నప్రేమను మించినదేదీ లేదంటారు. విడిపోయిన కన్నవారిని ఓ చిన్నారి ప్రేమ కలిపింది. ఆమె కన్నవారు సెలబ్రిటీస్ కావడంతో ఆ వార్త మరింతగా హల్ చల్ చేస్తోంది. ఇంతకూ విషయమేమిటంటే, ప్రముఖ మోడల్, టీవీ రియాలిటీ స్టార్ , బిజినెస్ ఉమన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్, ఇరవై ఏళ్ళలో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. కిమ్ మూడో భర్త ప్రఖ్యాత ర్యాపర్ కేన్ వెస్ట్. వీరిద్దరూ కలసి దాదాపు పదేళ్ళు కాపురం చేశారు. అంతకు ముందు సహజీవనమూ సాగించారు. […]
గత కొంతకాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘థాకడ్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. చైల్ట్ ట్రాఫిక్ మీద రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నటించింది. అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను చేసింది. కానీ పేలవమైన కథ, కథనాల కారణంగా ‘థాకడ్’కు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ మూవీ ఇంత దారుణంగా పరాజయం పొందడం ఇదే […]
మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి […]
డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలు అందుకున్న ప్రభుదేవా ఆ తర్వాత నటుడి, దర్శకుడిగానూ తన సత్తాను చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో ‘మై డియర్ భూతం’ అనే సినిమా తెరకెక్కుతోంది. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ గా ఈ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న […]
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని ఐదంటే ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, నిర్మాతగానూ సాగుతున్నారు. సంపత్ నంది 1980 జూన్ 20న తెలంగాణలోని ఓదెలలో […]
బాలతారలుగా భళా అనిపించి, నాయికలుగానూ మెప్పించిన వారున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు తులసి. పిన్నవయసులోనే కెమెరా ముందు అదురూ బెదురూ లేకుండా నించుని డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేసేసి మురిపించిన తులసి, తరువాత నాయికగానూ కొన్ని చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు. తులసి 1967 జూన్ 20న మద్రాసులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేది తులసి. ఆమె తల్లికి అంజలీదేవి, సావిత్రి మంచి స్నేహితులు. ‘భార్య’ అనే సినిమాలో […]
సినిమా కమిట్ అయి చేశామంటే అది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ వద్దకు చేర్చే బాధ్యత తారలదే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే దక్షిణాది సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేసుకున్న నయనతార మాత్రం ఇందుకు మినహాయింపు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత సొంత సినిమాలు తప్ప మిగతా సినిమాల ప్రచారంలో అమ్మడు పాల్గొన్నది తక్కువే. అదే సాయిపల్లవిని తీసుకుంటే ఎప్పుడో కమిట్ అయి రిలీజ్ కాక ఆగిన సినిమా రీలీజ్ అవుతుంటే […]