మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విక్రాంత్ రోణ’ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణలో బాలీవుడ్ అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర […]
అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని […]
శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘పాటలు, టీజర్ చూశాక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లీడ్ పెయిర్ విశ్వక్, ఐశ్వర్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మా […]
తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ మించి పోటాపోటీగా జరిగి పోటీ చేసిన రెండు ప్యానెల్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అధ్యక్షులుగా పోటీపడిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు సైతం విమర్శల దాడి చేసుకున్నారు. ఆ హోరా హోరీ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, విష్ణు ఎదురెదురు పడిన సందర్భం లేదు. అయితే బుధవారం యాక్షన్ కింగ్ […]
జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ […]
‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి సునామీలా దూసుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ కృతీశెట్టి. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెల్లువల పొంగుకొచ్చాయి. అయితే అదే సమయంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది కృతి. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కృతి కంటే… సాయిపల్లవికే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘బంగర్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో […]
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం పలు సంవత్సరాలు పాట్లు పడిన చరిత్ర శోభన్ బాబుది. దాదాపు పుష్కరకాలానికి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ విజయంతో స్టార్ అనిపించుకున్నారు శోభన్ బాబు. అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించారు. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత శోభన్ బాబు సైతం అదే తీరున విజృంభించారు. తరువాత “చెల్లెలికాపురం, అమ్మమాట, సంపూర్ణ రామాయణం” వంటి విలక్షణమైన చిత్రాలు, విజయాలూ శోభన్ ను పలకరించాయి. ఆ పై […]
కరోనా టైమ్ లో గతేడాది ‘డర్టీ హరి’తో సక్సెస్ చవిచూసిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషా సినిమాలతో పాటు ఎపిక్ […]
‘డాన్’ అనగానే ఆ తరం వారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, నవతరం ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ రెండు చిత్రాలు సలీమ్-జావేద్ కథతో రూపొందినవే. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ చంద్ర బరోట్ దర్శకత్వంలో రూపొందగా, 1978లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమా హైదరాబాద్ తారకరామ థియేటర్ లో 75 వారాలు ప్రదర్శితమైంది. అదే కథ 1979లో యన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేరుతో తెలుగులోనూ, ఆ తరువాత ‘బిల్లా’ పేరుతో రజనీకాంత్ తోనూ, […]