Road thriller: సరికొత్త కథాంశంతో ‘కరణ్ అర్జున్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ మూవీని డా. సోమేశ్వర రావు పొన్నాన , బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇదే నెల 24న 186 థియేటర్లలో విడుదల కాబోతోంది.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, ”మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి షూట్ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా, ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని చేసిన సినిమా ఇది. దీన్ని మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాం. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నాం. కానీ సౌత్, నార్త్ లో కూడా మా మూవీని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ సినిమా ప్రచారంలో దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, పరశురామ్ ఎంతో సహకరించారని నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల తెలిపారు. హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ, “ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై సినిమా చూడాలనుకున్నారు. మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీకీ తావు ఇవ్వలేదు. మూవీ మొత్తం లవ్ అండ్ యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది” అని చెప్పారు. నటుడిగా తనకిదే మొదటి సినిమా అని మరో హీరో అభిమన్యు తెలిపాడు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!