Chor Bazar: పాతికేళ్ళ విరామం తర్వాత తెలుగులో అర్చన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు దీనిని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్చన మీడియాతో మాట్లాడారు.
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ఇన్నేళ్ళుగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం చెబుతూ, ”నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏదీ లేదు. నేను చెన్నైలో ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. ఆచితూచి సినిమాలు చేయడం నాకు అలవాటు. దక్కిన అవకాశాలు, చేసిన సినిమాల పట్ల సంతృప్తి పడ్డాను. ఒక దశలో సినిమాల్లో మహిళలకు సరైన పాత్రలు లేకుండా పోయాయి. అలాంటప్పుడు సినిమాల్లో నటించి ఏం ఉపయోగం!? అనిపించేది. నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. వాళ్లు నాకిచ్చిన ఈ గౌరవాన్ని పాడు చేసుకోవడానికి కూడా నాకు హక్కు లేదు. తమిళం, కన్నడ, మలయాళంలో ఎప్పుడైనా ఒక ఆర్ట్ ఫిలింలో అవకాశం వస్తే నటిస్తూనే ఉన్నాను. తెలుగులో మాత్రమే నటించలేదు. ఇక్కడ నుంచి అవకాశాలు రాక కాదు. ప్రతి నెలా కనీసం రెండు సినిమాలకు నన్ను నటించమని అడుగుతుంటారు. వాటి పేర్లు చెప్పను కానీ పేరున్న హీరోల సినిమా అవకాశాలూ వస్తుంటాయి. నాకెందుకో ఆ పాత్రల్లో నటించాలని అనిపించలేదు” అని అన్నారు.
తాజా చిత్రం ‘చోర్ బజార్’లోని తన పాత్ర గురించి చెబుతూ, ”జీవన్ రెడ్డి తీసిన ‘జార్జ్ రెడ్డి’ సినిమా చూశాక దర్శకుడు ఒక బోల్డ్ అటెంప్ట్ చేశాడని అనిపించింది. విమర్శలు వస్తాయని కూడా భయపడకుండా ఒక కమిట్ మెంట్ తో ఆ సినిమా చేశాడు. టెక్నికల్ గా ఆ సినిమాను రూపొందించిన విధానం నన్ను ఆకట్టుకుంది. ఈ మధ్య సినిమాల్లో సాంకేతికత పెరిగింది. అయితే ఆ అడ్వాంటేజ్ ను జీవన్ ఉపయోగించుకుండా, దర్శకుడి కోణాన్ని మాత్రం తెరపై చూపించాడు. ‘చోర్ బజార్’ సినిమా కోసం ఆయన నన్ను సంప్రదించినప్పుడు నువ్వు చేసిన ‘జార్జ్ రెడ్డి’ సినిమా బాగుంది. అయితే నాకు ఇప్పుడు సినిమాలు చేసే ఆసక్తి లేదని చెప్పా. మీరు కనీసం రెండు సినిమాలైనా చేయాలని ఇటీవల యువ దర్శకులు కొందరు నాతో అన్నారు అది గుర్తొచ్చి. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నేను ఎవరికి తల్లి, ఎవరికి వదిన, ఎవరికి అత్త అని అడిగాను. మీరు ఎవరికీ ఏదీ కాదు, ఒక తల్లి, మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ఆ మాటతో ఆలోచనలో పడ్డాను. ఒక లైన్ చెప్పమంటే ఈ సినిమాలో మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఆయన్ను ప్రేమిస్తారు. ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతారు అన్నాడు. ఇంకేమీ చెప్పకు షూటింగ్ ఎప్పుడని అడిగా. నిజంగా తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. అలాగే అమితాబ్ కోసం ఒంటరిగా అలాగే ఉండిపోయినవారున్నారు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర అనిపించింది. అమితాబ్ బచ్చన్ అంటే ఆమెకు ఎంత ప్రేమంటే నిద్రపోయేప్పుడు కూడా మేకప్ వేసుకుని పడుకుంటుంది. కలలో అమితాబ్ వస్తే చూసి ఇష్టపడాలని. నాకు మేకప్ ఇష్టం లేదు కానీ ఈ క్యారెక్టర్ కోసం వేసుకున్నా. కథతో పాటు ఈ పాత్ర సాగుతుంటుంది. కొంత సస్పెన్స్ కూడా ఉంటుంది. హీరో పేరు బచ్చన్ సాబ్, మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. రెండు నిమిషాలు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. ఇది ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్. అందుకే ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటకొచ్చి నటించాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!