మాస్ మహరాజా రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. అయితే మూవీని మరింత చక్కగా జనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జూన్ 17న విడుదల కావాల్సిన దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. […]
యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన తారాగణంగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. దీనికి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాత. ఈ సినిమా రెండు పాటల మినహా పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఆ రెండు పాటలను కశ్మీర్ లో చిత్రీకరించబోతున్నారు. వీటి షూటింగ్ నిమిత్తం యూనిట్ కశ్మీర్ వెళుతున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా […]
ఇటీవల విడుదలైన ‘మోడరన్ లవ్ ముంబై’ విజయంతో జోరు మీదున్న ప్రైమ్ వీడియో, జూలై 8న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ ఒరిజినల్ సీరిస్ ను ప్రసారం చేయనుంది. ప్రముఖ నిర్మాత ఎలాహే హిప్టూలా, ఎస్.ఐ.సి. ప్రొడక్షన్స్ ఈ కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ని నిర్మించారు. దీనికి షో రన్నర్‌గా నగేష్ కుకునూర్ వ్యవహరిస్తున్నారు. ఇందులోని ఆరు ఎపిసోడ్స్ ను నగేశ్ కుకునూర్, ఉదయ్ కుర్రాల, దేవికా బహుధనం, వెంకటేశ్ మహా రూపొందించారు. వీటిలో నగేశ్ కుకునూర్ […]
బుల్లితెర వీక్షకుల కోసం యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలను, షోస్ ను నిర్వహించాడు. తాజా ఈ క్రేజీ అండ్ పాపురల్ యాంకర్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అందుకు ఆహా వేదిక కానుండటం విశేషం. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓంకార్ ‘డాన్స్ ఐకాన్’ అనే డాన్స్ షోకు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని గురించి ఓంకార్ మాట్లాడుతూ, ”ఆహా, ఓక్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సమర్పిస్తున్న కార్యక్రమం ‘డాన్స్ ఐకాన్’. దీని ద్వారా […]
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ముహూర్తం జరుపుకుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (‘అనగనగా ఒక రాజు’) చిత్ర యూనిట్ […]
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ డూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ మాత్రం ఈ కుర్రహీరోని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రంగ రంగవైభవంగా’ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్ తేజ్ తో సినిమాను […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. […]
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తలపెట్టిన సమ్మె విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, థియేటర్లలో సినిమాలకు తగిన ఆదరణ లభించడం లేదని, ఇప్పుడిప్పుడే కొవిడ్ సమస్యల నుండి బయటపడి కుదురుకుంటున్న సమయంలో సమ్మెకై 24 యూనియన్ల నాయకులు ఫెడరేషన్ పై ఒత్తిడి తేవడం సబబు కాదని నటుడు, ఫిల్మ్ ఆర్టిస్ట్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ ఓ కళ్యాణ్ అంటున్నారు. కరోనా సమయంలో సినిమా పెద్దలు, నిర్మాతలు అందరకూ […]
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ […]