PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
- ప్రత్యేక విందులో సాంస్కృతిక కార్యక్రమం
- ఇథియోపియా కళాకారులు భారత జాతీయ గీతం “వందేమాతరం”ను ఆలాపన.
- వందేమాతరం ఆలాపనను ఆస్వాదించిన ప్రధాని మోదీ
- చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ ఆనందంతో స్పందన.
- అభినందించిన మోదీ వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం..
Also Read
మంగళవారం నాడు అడిస్ అబాబా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని స్వయంగా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వాగతించారు. అంతేకాదు.. ఆయన స్వయంగా వాహనం నడుపుతూ మోదీని హోటల్‌కు తీసుకెళ్లడం అరుదైన ఘటనగా నిలిచింది. మంగళవారం సాయంత్రం ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా మారింది. భోజన కార్యక్రమానికి తోడు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఇథియోపియా కళాకారులు “వందేమాతరం”ను మనసుకు హత్తుకునేలా ఆలపించారు. ఈ ప్రదర్శనను ఆస్వాదించిన ప్రధాని మోదీ కళాకారులను చప్పట్లతో అభినందించారు. ఆ సందర్భంలో అచ్చం ఓ పిల్లడు ఎలా ఆనందాన్ని ఆస్వాదిస్తాడో అలా ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. “నిన్న ప్రధాని అబియ్ అహ్మద్ అలీ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం అద్భుతంగా పాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ అనుభూతి మరింత భావోద్వేగంగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రదర్శన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్, ఆఫ్రికా సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆఫ్రికా దేశాలతో దౌత్య, అభివృద్ధి సంబంధాలు మరింత వేగం పుంజుకున్నాయి.
At yesterday’s banquet dinner hosted by Prime Minister Abiy Ahmed Ali, a wonderful rendition of Vande Mataram was sung by Ethiopian singers. It was a deeply moving moment, that too at a time when we are marking 150 years of Vande Mataram. @AbiyAhmedAli pic.twitter.com/TeHbPzBBLb
— Narendra Modi (@narendramodi) December 17, 2025
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?