Manchu Vishnu: ‘జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటీనటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు రాజీ పడటం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా, ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ‘జిన్నా’ లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పార్టీ సాంగ్ కి గణేష్ ఆచార్య స్టెప్స్ సమకూర్చారు. ఎంగేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ప్రభుదేవా, గణేష్ ఆచార్య తో పాటు ఈ సినిమా కోసం డ్యాన్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా లీడ్ పెయిర్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు…’ పాట కోసం డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన స్టెప్స్ కి ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రముఖ డ్యాన్సర్స్ ‘జిన్నా’ పాటలకు కొరియోగ్రఫీ సమకూర్చడం సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి.
మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో నిర్మితమౌతున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!