8000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో సంచనాలు సృష్టించడానికి వచ్చేస్తున్న HONOR WIN, HONOR WIN RT స్మార్ట్ ఫోన్స్..!
- HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్‌లు
- డిసెంబర్ 26న చైనాలో లాంచ్
- ఈ కొత్త WIN సిరీస్, ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా
- హానర్ ప్రకారం ఈ ఫోన్‌లను పూర్తిగా Next-Gen Gaming Powerhouseగా డిజైన్
- ఫోన్‌లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో లభించనున్నాయి.
- స్లీక్ కర్వ్ డిజైన్తో పాటు, ఎక్కువసేపు గేమింగ్ చేసినా చేతికి ఇబ్బంది లేకుండా
- వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR WIN, HONOR WIN RT: హానర్ (HONOR) సంస్థ HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి రానున్నాయి. సంస్థ ప్రకారం WIN సిరీస్‌ను పూర్తిగా నెక్స్ట్-జెన్ గేమింగ్ పవర్‌హౌస్ గా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్లీక్ కర్వ్ డిజైన్‌తో రూపొందించడంతో పాటు.. ఎక్కువ సేపు గేమింగ్ చేసినా చేతికి ఇబ్బంది లేకుండా గ్రిప్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది.
Gold Silver Rates: చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ఇక మొబైల్ వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండటంతో చెమట వల్ల స్లిప్ కాకుండా ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యేకంగా రూపొందించిన ప్రిసిషన్ ఇంజినీర్డ్ మిడ్-ఫ్రేమ్ ఆర్మర్ వల్ల గేమింగ్ సమయంలో కూడా ఫింగర్‌ప్రింట్స్ పడకుండా ఉంటాయని హానర్ పేర్కొంది. బయటకు వచ్చిన ఇమేజ్ ప్రకారం.. ఈ సిరీస్ ఫోన్‌ల వెనుక భాగంలో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కనిపిస్తోంది. ఇది గేమింగ్ సమయంలో హీట్ కంట్రోల్‌కు చాలా ఉపయోగపడే ఫీచర్‌గా భావిస్తున్నారు.
HONOR WIN RTలో డ్యుయల్ రియర్ కెమెరాలు, HONOR WINలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ కెమెరాలను మ్యాట్రిక్స్ కెమెరా డెకో డిజైన్లో అమర్చారు. వీటితోపాటు కుడి వైపు ప్రత్యేకమైన డెడికేటెడ్ బటన్ కూడా కనిపిస్తోంది. ఇది గేమింగ్ కంట్రోల్స్ లేదా షార్ట్‌కట్‌ల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. రిపోర్టుల ప్రకారం HONOR WIN సిరీస్ ఫోన్‌లు Snapdragon 8 Gen 5, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌లతో రావచ్చని అంచనా.
IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ఇక పవర్ బ్యాక్‌అప్ విషయంలో ఈ ఫోన్‌లు నిజంగా గేమింగ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. సుమారు 8000mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. HONORకు చెందిన AAK-AN00, AAP-AN00 మోడల్ నంబర్లతో ఉన్న ఫోన్‌లు 3C సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. లీక్‌లు, రిపోర్టుల ప్రకారం HONOR WIN మరియు WIN RT ఫోన్‌లలో.. 6.83 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫుల్-లెవల్ వాటర్ రెసిస్టెన్స్, పెద్ద సెన్సార్‌తో 50MP మెయిన్ కెమెరా వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 26 లాంచ్ తర్వాత పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు స్పష్టత రానున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!