ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా తమిళ్ మూవీ అసురన్‌ను తెలుగులో వెంకీతోనే నారప్పగా రీమేక్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు శ్రీకాంత్ అడ్డాల.
అయితే తాజాగా రవితేజ-వెంకీ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌కు కథ చెప్పాడని, వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే రవితేజకు కూడా కథ వినిపించబోతున్నాడట. ఇక ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకు రావడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ వార్తల్లో క్లారిటీ లేకపోయినా.. ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కానీ ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా.. అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ప్రస్తుతం రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘రామరావు ఆన్ డ్యూటీ’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే రావణసుర, ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు.. చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’లో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. వెంకీతో మల్టీ స్టారర్ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.